జగన్ సంచలన నిర్ణయం స్టూడెంట్స్ ఎగిరి గంతేస్తారు

జగన్ సంచలన నిర్ణయం స్టూడెంట్స్ ఎగిరి గంతేస్తారు

0
38

ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది అంతేకాదు స్టూడెంట్స్ విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు.. ఉద్యోగాల కల్పన కోసం అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా ఒక సంవత్సరం అదనంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాం మొదలుపెట్టేలా ప్రణాళికలు చేయాలని సూచించారు అనే విషయం తెలిసిందే

డిగ్రీ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ ఐదు సంవత్సరాలు చదివేలా నిర్ణయం తీసుకుటోంది సర్కార్. చదివిన విద్య మీద పట్టు లేకపోవడం, తగిన నైపుణ్యం పొందకపోవడం ఇలా ఎంతో మందికి ఉద్యోగాలు రావడం లేదు అని తేలింది. అందుకే కాలేజీల్లోనే తగిన నైపుణ్యం పొందేందుకు ఒక సంవత్సరం అదనంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాంని ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు.

స్టూడెంట్స్ కు తాజా నిర్ణయం వారికి ప్లస్ కానుంది..మొత్తానికి వచ్చే ఏడాది నుంచి ఇది అమలు అయితే కాలేజీలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.. ప్రభుత్వ కళాశాలలో మరింతమెరుగైన సౌకర్యాలు కల్పించాలి అని ప్రభుత్వం కూడా భావిస్తోంది.