గోవాకి చిరంజీవి చిన్న అల్లుడు ఏం చేస్తున్నారంటే

గోవాకి చిరంజీవి చిన్న అల్లుడు ఏం చేస్తున్నారంటే

0
83

చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ విజేత సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు, అయితే ఆ సినిమా వసూళ్లు పరంగా అంత కాకపోయినా కల్యాణ్ కు మంచి ఫేమ్ తెచ్చింది… హీరోగా లుక్స్ పరంగా మంచి ఫేమ్ వచ్చింది. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ పులివాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి సినిమా చేస్తున్నాడు.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా ద్వారా కథానాయికగా రచితా రామ్ పరిచయమవుతోంది. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యామిలీ కూడా ఆశలు పెట్టుకుంది.. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి అయింది, మూడు పాటలు కూడా షూటింగ్ అయ్యాయి.

ఇక ఈ సినిమా కోసం రెండు పాటలని గోవాలో షూట్ చేయాలి అని అనుకుంటున్నారట, అందుకే చిత్రయూనిట్ గోవా వెళ్లనుంది అని తెలుస్తోంది.. వేసవి లో ఈ సినిమాని అభిమానుల ముందుకు తీసుకురానున్నారట. సో చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతోందో.