చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నేషనల్ అవార్డు పొందిన ప్రముఖ నటి సురేఖ సిక్రి నేడు ఉదయం కన్నుమూశారు. 75ఏళ్ల సురేఖ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. సినిమాల్లో, బుల్లితెరలో ఆమె చెరగని ముద్ర వేశారు. ఆమె మరణించారు అనే వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. కొద్దిరోజుల క్రితం సురేఖ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు.
షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్లగా బాత్రూమ్ లో ఆమె క్రిందపడిపోయారు. ఆ సమయలో ఆమె తలకి గాయం అయింది. వెంటనే చికిత్స అందించారు. ఆమె కోలుకుని ఇంటిలో రెస్ట్ తీసుకున్నారు. ఇక ఆమె బాలిక వధు సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ఇటు తెలుగు ప్రేక్షకులకి కూడా చిన్నారి పెళ్లికూతురుగా ప్రసారమైన ఈ సీరియల్ తో దగ్గర అయ్యారు అనే చెప్పాలి.
ఆమె ఇన్నేళ్ల సుదీర్ఘ చిత్ర సీమ ప్రయాణంలో. మూడు సార్లు ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డ్స్ అందుకున్నారు.బాలీవుడ్ లో ఆమె పలు చిత్రాల్లో నటించారు. 30 ఏళ్లుగా బాలీవుడ్ చిత్ర సీమలో బుల్లితెరలో ఆమె నటించారు. ఆమె మరణంతో బీ టౌన్ లో ప్రముఖులు అందరూ కూడా సంతాపం తెలిపారు.