ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. విశాఖ నుంచి వస్తుండగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాకేష్ మాస్టర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కాగా రాకేష్ మాస్టర్ ఇటీవల సెలబ్రిటీలపై అసభ్యకర కామెంట్లు, వివాదాస్పద ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబ్లో ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. మందు తాగుతూ పచ్చి బూతులు తిడుతూ వీడియోలు చేస్తూ తరచూ వివాదాల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆయన మృతి పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.