Baby Movie |కాపీరైట్ వివాదంలో ‘బేబీ’ సినిమా.. దర్శకుడు, నిర్మాతపై ఫిర్యాదు..!

-

గతేడాది చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’ సినిమా(Baby Movie) ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తనదేంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ చేసే శిరిన్ శ్రీ‌రామ్ అనే వ్యక్తి 2013లో ‘బేబీ’ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్‌ని క‌లిసి క‌థ చెప్పానని ఆరోపిస్తున్నాడు. త‌న క‌థ‌ను ‘బేబీ’ సినిమాగా తీశారని, కాపీరైట్స్ చ‌ట్టాన్ని ఉల్లంఘించారని దర్శకుడు రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

- Advertisement -

2015లో తాను ‘క‌న్నా ప్లీజ్’ పేరుతో క‌థ రాసుకుని దానికి ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్ పెట్టుకున్నాన‌ని.. సాయి రాజేశ్ సూచ‌న‌తోనే నిర్మాత ఎస్కేఎన్‌కి కథ చెప్పాన‌ని తెలిపారు. అదే కథతో 2023లో బేబీ సినిమా(Baby Movie)ను తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా విషయంలో దర్శకుడు కొరటాల శివ కూడా కాపీరైట్స్ వివాదం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Read Also: రచ్చబండలో వైయస్ షర్మిలకు ఊహించని ప్రశ్న.. ఆమె ఏం చెప్పారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...