YS Sharmila | రచ్చబండలో వైయస్ షర్మిలకు ఊహించని ప్రశ్న.. ఆమె ఏం చెప్పారంటే..?

-

జిల్లాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం నర్సీపట్నం(Narsipatnam) నియోజకవర్గం ములగపుడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిలకు ఓ కార్యకర్త నుంచి ఊహించని షాక్ తగిలింది. వైఎస్ కుటుంబంను వేధించిన కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారని ఓ వ్యక్తి నిలదీశాడు. కాంగ్రెస్ పార్టీ అక్రమాస్తుల కేసులో వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చిందని గుర్తుచేశాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు.. అప్పుడు మీకు అండగా నిలిచామన్నాడు.

- Advertisement -

దీనిపై షర్మిల తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్‌లో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన తప్పు కాదని స్పష్టంచేశారు. అది తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన పొరపాటు కాదని వివరించారు. తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయినప్పుడు వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన విషయం తమకు తెలియదని వారు చెప్పారని తెలిపారు. గతంలో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు బోఫోర్స్ కుంభకోణంలో కూడా ఆయన పేరు చేర్చారని తెలిపారు. వైఎస్సార్ కుటుంబం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉందని.. వైఎస్సార్ అంటే సోనియాకి అపారమైన గౌరవం అని పేర్కొన్నారు. తాను నమ్మాను కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు.

అనంతరం ప్రభుత్వం పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ వారసులు అంటే జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి కదా..? ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి కదా..? జలయజ్ఞం ప్రాజెక్ట్‌లను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో వ్యవసాయం దండగా అనిపించేలా చేశారని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంట నష్ట పరిహారం లేదని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేయకపోతే ఓటు అడగనన్న పెద్ద మనిషి.. నిషేదం కాదు కదా స్వయంగా మద్యం అమ్ముతున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం అమ్ముతూ జనాల ప్రాణాలు తీస్తున్నారంటూ ఆరోపించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని.. కానీ అధికార, ప్రతిపక్ష ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారారని విమర్శించారు. ఎంపీలు రాజీనామా చేసి ఉంటే హోదా వచ్చి ఉండేదన్నారు. కేంద్రంలోని బీజేపీ మీద దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఇక 25వేల డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు 6వేల పోస్టులు అంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా..? పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నా..? యువతకు ఉద్యోగాలు రావాలన్నా..? రాజధాని నిర్మాణం జరగాలన్నా..? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని షర్మిల(YS Sharmila) విజ్ఞప్తి చేశారు.

Read Also:  సీఎం జగన్ అసలు రంగు బయట పడింది: జానీ మాస్టర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...