Jani Master | సీఎం జగన్ అసలు రంగు బయట పడింది: జానీ మాస్టర్

-

సీఎం జగన్ అసలు రంగు బయట పడిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) విమర్శించారు. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరులో పర్యటించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని తెలిపారు. రూపాయికే ఇల్లు అని చెప్పి చివరకు శఠగోపం పెట్టారని మండిపడ్డారు. కనీసం గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

జగన్ పాలన మొత్తం రివర్స్ అని ఫైర్ అయ్యారు. ఇక నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే ఆయనను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారని ఎద్దేవా చేశారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఇచ్చేంత వరకు తాను పోరాడతానని ప్రభుత్వాన్ని జానీ మాస్టర్(Jani Master) హెచ్చరించారు.

Read Also: ఏపీలో పొత్తులపై అమిత్ షా క్లారిటీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Fennel Seeds | సోంపుతో సూపర్ ప్రయోజనాలు..

మన వంటిల్లు వైద్యశాల అని భారతదేశంలో అందరూ నమ్ముతారు. మనకు తరచుగా...

Manchu Manoj | నాకా నమ్మకం ఉంది: మనోజ్

నేరేడ్‌మెట్ పోలీస్ కమిషనర్ విచారణలో పాల్గొన్న మనోజ్(Manchu Manoj).. తనకు న్యాయం...