కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి షాక్ లో చిత్ర పరిశ్రమ

కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి షాక్ లో చిత్ర పరిశ్రమ

0
94

ఈ వైరస్ మహమ్మారి చిత్ర పరిశ్రమని కూడా వదలడం లేదు, ఇక్కడ కూడా పలువురు దర్శక నిర్మాతలకు హీరోలకు వారి కుటుంబ సభ్యులకి పాకేసింది. తాజాగా బాలీవుడ్ లో చాలా మందికి ఈ వైరస్ సోకడంతో వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.

నేడు ప్రముఖ నిర్మాత అనిల్ సూరి కన్నుమూశారు. అనిల్ సూరి మరణించిన విషయాన్ని ఆయన తమ్ముడు నిర్మాత రాజీవ్ సూరి మీడియాకు తెలిపారు. అనిల్ సూరీకి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదు తీవ్రమైన జ్వరం వచ్చింది, దీంతో వెంటనే ఆయనని ఆస్పత్రికి తీసుకువెళ్లారు

అయితే మొదట తీసుకెళ్లిన ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోకపోవడంతో మరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశామన్నారు. అక్కడ ఆరోగ్యం విషమించడంతో మరణించాడని వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యుల మధ్య పూర్తి అయ్యాయి, ఆయన మంజిల్, కర్మయోగి, రాజ్ తిలక్ వంటి ప్రముఖ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మరణం చిత్ర సీమకు తీరని లోటు అని బీ టౌన్ లో అందరూ సంతాపం తెలిపారు.