స్టార్​ హీరోయిన్​ సమంతకు క్రేజీ ఆఫర్​..ఒకేసారి మూడు సినిమాలు!

Crazy offer for star heroine Samantha .. three movies at once!

0
101

నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్​లో హీరోయిన్​ సమంత దూసుకెళ్తోంది. ఇప్పటికే వరుస సినిమాలకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిన ఈ ముద్దుగమ్మ మరో క్రేజీ ఆఫర్ కు ఒకే చెప్పినట్టు సమాచారం. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్​రాజ్​ ఫిల్మ్స్​ తమ బ్యానర్​లో మూడు సినిమాలు చేయాలని అడగగా..సామ్ సానుకూలంగా స్పందించినట్లు టాక్.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే ‘ఫ్యామిలీమ్యాన్​’ వెబ్​సిరీస్​తో బీటౌన్​లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సామ్​.. తాజా ప్రాజెక్ట్​లతో మరింత క్రేజ్​ను సంపాదించుకునే అవకాశముంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా, గుణశేఖర్​ దర్శకత్వంలో సామ్​ నటించిన ‘శాకుంతలం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే ‘యశోద్’​ అనే చిత్రం సహా పలు సినిమాల్లో నటిస్తోంది.

మరోవైపు అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో స్పెషల్​ సాంగ్‌ ‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’ సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కెరీర్‌లోనే తొలిసారి ఈ పాటతో ప్రత్యేక గీతంలో నర్తించింది నటి సమంత.