సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఇప్పటి నుంచి కాదు సినిమాలు స్టార్ట్ అయిన సమయం నుంచి వచ్చింది. నేటి బడా హీరోల్లో అలా వచ్చిన వారసులు చాలా మంది ఉంటారు, తాజాగా మరో సినీ వారసుడు ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
దగ్గుబాటి సురేష్ బాబు ప్రముఖ నిర్మాత , ఆయన తనయుడు రానా సినిమాల్లో నటిస్తున్నారు, ఇక ఆయన సోదరుడు దగ్గుబాటి అభిరామ్ సినిమాల్లోకి రానున్నాడట. అయితే అభిరామ్ పెద్దగా ముందు ఎవరికి తెలియక పోయినా శ్రీరెడ్డి అంశంతో ఆయన పేరు బాగా వినిపించింది. తనతో అఫైర్ పెట్టుకున్నాడంటూ మీడియాలో అనేక పిక్స్ రిలీజ్ చేసింది..
తాజాగా అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడట. ఆ మధ్య రాజు మహరాజు దర్శకుడు భాను శంకర్ ఈయన కోసం కథ కూడా సిద్ధం చేసాడని.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే అభి లాంఛ్ అవుతాడని వార్తలు కూడా వచ్చాయి. కాని అది మళ్లీ పట్టాలెక్కలేదు, తాజాగా అసురన్ రీమేక్ లో ఆయన నటిస్తారట. ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం చేస్తారు, అలాగే వెంకటేష్ హీరోగా చేస్తున్నారు.. హీరో రెండో కొడుకు పాత్రలో అభిరామ్ నటించబోతున్నాడని తెలుస్తోంది.