దగ్గుబాటి హీరో సంచలన ట్వీట్..పోస్టులన్నీ డిలీట్-ప్రేమతో రానా అంటూ..

0
101

దగ్గుబాటి రానా. లీడర్ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ హీరో బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభుమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల విరాటపర్వంతో థియేటర్లలోకి వచ్చిన రానా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుంటాడు.

ఇక తాజాగా రానా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కొంతకాలం తాను సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించిన రానా అందుకు అనుగుణంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లోని అన్ని పోస్టులను డిలీట్‌ చేశారు. ‘కొంతకాలం సోషల్‌మీడియా నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. మళ్లీ మూవీల్లో కలుద్దాం. బిగ్గర్​.. బెట్టర్.​. స్ట్రాంగర్.​. మీపై అమితమైన ప్రేమతో.. రానా’ అని ఆగస్టు 5న ట్వీట్‌ చేశారు. అన్నట్లుగానే ఇన్‌స్టా పోస్టులను డిలీట్‌ చేశారు.

ఇక ప్రస్తుతం రానా బాబాయ్‌ వెంకటేశ్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ ‘రానానాయుడు’లో నటిస్తున్నారు. తేజతో సినిమా చేయనున్నట్లు ప్రకటించినా దానిపై మళ్లీ ఎలాంటి వార్తలూ రాలేదు. అలాగే ‘హిరణ్యకశ్యప’ అనే పౌరాణిక చిత్రం చేస్తానని కూడా రానా ప్రకటించారు.