ఆర్ ఆర్ ఆర్ ఈ పిక్చర్ పై ఇప్పటి నుంచే హైప్ అనేది పెరిగిపోయింది.. ఇక సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.. అయితే బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో, దీనిపై కూడా అంతే హైప్ ఉంది. అయొతే రామ్ చరణ్ ఎన్టీఆర్ ను ఈ సినిమాలో ఎలా చూపిస్తారు వారి గెటప్ ఎలా ఉంటుంది. ఆ లుక్ పై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇటీవల జక్కన్న హీరోయిన్ల గురించి క్లారిటీ కూడా ఇచ్చారు.. చిత్రంలో ఆలియా భట్ చరణ్ సరసన, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నారని వెల్లడించారు.
ఈ సినిమాలో డైసీ ఎన్టీఆర్‌కు జోడిగా నటించనున్నట్లు తెలియచేశారు…జక్కన్న అలా ప్రకటించారో లేదో.. ఇంతకీ ఎవరీ డైసీ అని గూగుల్ లో సెర్చింగ్ మొదలు పెట్టేశారు. ఇక డైసీ గురించి చూస్తే ఆమె ఓ బ్రిటీష్ నటి, సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్’ వంటి టీవీ సిరీస్‌లలో నటించింది. అక్కడ మంచి ఫేమ్ ఉన్నా నటి, పైగా నటన అంటే చాలా ఇష్టమున్న హీరోయిన్, ఇక ఆమెకు ఈ సినిమాలో 18 కోట్ల వరకూ పారితోషికం ఇస్తున్నారని టాక్ అయితే నడుస్తోంది. గతేడాది ‘పాండ్ లైఫ్’ అనే సినిమాలో కాషీ అనే పాత్రలో నటించింది.. దీంతోపాటు ‘ది రిలెక్ట్యుంటె ఫండమెండలిస్ట్’లో నాటకంలోనూ, ‘వింటర్ సాంగ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించింది. బ్రిటన్ లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన నటి మరి 18 కోట్లు అంటే బిగ్ ఆఫర్ అంటున్నారు ఇండస్ట్రీలో వారు.