దర్బార్ ఇక్కడ దద్దరిల్లుతుందా

దర్బార్ ఇక్కడ దద్దరిల్లుతుందా

0
107

సూపర్ స్టార్ రజనీ కాంత్ కు తమిళంలోనే కాదు తెలుగులోను మంచి క్రేజ్ ఉంది… అయితే ఈ మధ్య వరుసగా రజనీ సినిమాలు తెలుగు వచ్చాయి కానీ అవి పెద్దగా రానించలేక పోయాయి… ఇప్పుడు మరోసారి దర్భర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు చూస్తున్నారు…

ఈ చిత్రం జనవరి 10 రిలీజ్ కానుంది.. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను దర్శకుడు మురుగదాస్ రిలీజ్ చేశారు… ఈ ట్రైలర్ కు తమిళంలో భారీ స్పందన వచ్చినప్పటికీ తెలుగు వెర్షన్ లో స్పందన దక్కేలేదు… ఈ చిత్రం అసలే సంక్రాంతి సీజన్ లో విడుదల కానుంది…

11 న మహేష్ సరిలేరునీకెవ్వరు సినిమా రిలీజ్ కానుంది… అలాగే 12 న అలా వైకుంఠపురంలో రిలీజ్ కానున్న క్రమంలో దర్బార్ కోసం ప్రేక్షులు ఎగబడే అవకాశంలేదని అంటున్నారు… అసలే దర్శకుడు మురుగదాస్ స్పైడర్ షాక్ ఇచ్చారు మరి… అయితే రజనీని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం రెగ్యులర్ స్టైల్ కాకుండా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంటే మాత్రం సత్తా చాటగలరు