దిశ పేరుతో సినిమా వర్మ మరో సంచలనం

దిశ పేరుతో సినిమా వర్మ మరో సంచలనం

0
94

దిశ ఘటన 2019లో అందరిని కలిచివేసింది. అత్యంత దారుణంగా నలుగురు దుర్మార్గులు ఆ డాక్టర్ ని చంపేశారు.. వారిలో చెన్నకేశవులు కూడా ఒకడు, అయితే అందరిలో కంటే మీడియా ముఖంగా వార్తల్లో బాగా వినిపించిన పేరు, నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకది, ప్రభుత్వం తనకు ఏదైనా సాయం చేయాలి అని కోరింది. చిన్నతనంలో ప్రేమ పెళ్లి చేసుకుని భర్తకి కూడా దూరం అయింది, ఇక ఆమె గర్భవతి దీంతో ఆమె బాధని చాలా మంది చూసి చలించిపోయి ఆమెకి సాయం చేశారు.

ఈ సమయంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు సమాజానికి అవసరమైన టాపిక్ను ఎంచుకుని సినిమాను తీస్తున్నారు. రేపిస్ట్లలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకని వర్మ కలిశారు. ఆమెను తన ఆఫీస్కు పిలిపించి కీలక విషయాలు అడిగి తెలుసుకున్నారట. అసలు ఎలా ఉండేవాడు, మీ ప్రేమ పెళ్లి ఎలా జరిగింది అని అడిగారట.

మీరు మీ కుటుంబ సభ్యులు తనలో ఇలాంటి కోణం ఉంది అని ఎప్పుడైనా గుర్తించారా.. ఇలాంటి అనేక విషయాలు తెలుసుకున్నారు. ఇక ఈ ఘటన మీద సినిమా తీయడానికి రెడీ అయ్యి స్టొరీ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆ ఘటన గురించి స్టోరీ లైన్ చేస్తున్నారట. త్వరలో దీని గురించి పూర్తి వివరాలు ఆయన తెలియచేయనున్నారట.