ఆ రోజే దేవదాస్ సినిమా ఆడియో లాంచ్

ఆ రోజే దేవదాస్ సినిమా ఆడియో లాంచ్

0
140

అక్కినేని నాగార్జున, నాని హీరోలుగా యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో అకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు అయ్యింది.

మహానటుడు ఏఎన్నార్ జయంతి సందర్భంగా ఈ నెల 20న ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.