టాలీవుడ్ లో జీవితా, రాజశేఖర్ జంటకి ఎంత ప్రత్యేక స్దానం ఉందో తెలిసిందే. ఇక ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు సంపాదించారు. జీవిత రాజశేఖర్ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. రాజశేఖర్ తో చేసిన ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, మహంకాళి, సినిమాలకు దర్శకత్వం వహించి, టాలీవుడ్ లో దర్శకురాలిగా కూడా తన ముద్ర చూపించారు.
అయితే చాలా మందికి తెలియనిది ఏమిటి అంటే? జీవితకు చెల్లెలు ఉన్నారు. ఆమె కూడా ప్రముఖ హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు. జీవిత తలంబ్రాలు సినిమాలో నటించిన సమయంలో, ఆమె చెల్లెలు ఉమా కూడా షూటింగ్ చూసేందుకు వచ్చేవారట. ఆ సమయంలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆమె తో సినిమా చేయాలని పట్టుపట్టారట.
ఇక ఆమె చెల్లెలికి రెండు రోజులపాటు యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత షూటింగ్ చేశారట. అయితే తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించారు. తర్వాత సినిమాలకు ఆమె గుడ్ బై చెప్పేశారు. జీవిత మాత్రం సినిమా పరిశ్రమలో కొనసాగారు.