అదిరిపోయే ఆఫర్ కొట్టిన దిల్ రాజు

అదిరిపోయే ఆఫర్ కొట్టిన దిల్ రాజు

0
61

ఈ ఏడాది ఎఫ్ 2 సాధించిన సక్సెస్ తెలిసిందే, అసలు సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు అన్ని కూడా పక్కన పెట్టి బాక్సాఫీసుని ఒక ఊపు ఊపేసింది ఎఫ్ 2 … ఈ సినిమాలో నటించిన విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కథానాయకులుగా, తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా సూపర్ హిట్ సక్సెస్ అని అభినందనలు అందుకున్నారు. ఈ సక్సెస్ ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు దిల్ రాజు.బాక్సాఫీస్ వద్ద దాదాపు 80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక పెద్ద ట్రీట్ కూడా ఇచ్చారు దిల్ రాజు.

ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు అని తెలుస్తోంది… ఈ స్వీట్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ లో వైరల్ అవుతోంది.ఎఫ్ 2` చిత్రాన్ని హిందీలో బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు స్వయంగా నిర్మిస్తున్నారు. ఆ మేరకు ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ అధికారికంగా వివరాల్ని వెల్లడించారు. బాలీవుడ్ లో ట్యాలెంటెడ్ అనీష్ బజ్మి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. సో ఈసినిమాలో క్రూ ఎవరు అనేది తెలియాలి …కామెడీ ఫ్యామిలీ చిత్రంగా ఈ సినిమా మంచి ఫేమ్ సంపాదించింది, ఇప్పటికే అనిల్ రావిపూడి ఎఫ్ 2 కి రెడీ అయ్యారు ఇది టాలీవుడ్ కు మంచి శుభపరిణామం అనే చెప్పాలి, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఓ ఫ్రాంచైజీ వెళ్లినట్టే.