డైరెక్ట‌ర్ కు భ‌లే కొత్త మెలిక పెట్టాడంట అల్లు అర్జున్ ?

డైరెక్ట‌ర్ కు భ‌లే కొత్త మెలిక పెట్టాడంట అల్లు అర్జున్ ?

0
88

అల వైకుంఠ‌పురం చిత్రం బ‌న్నీకి మంచి హిట్ అందించింది.. ఆల్ టైమ్ హిట్ గా బ‌న్నీకి రికార్డులు నెల‌కొల్పింది, అయితే ఈ సంక్రాంతికి విడుద‌ల అయిన ఈ చిత్రం త‌ర్వాత, బ‌న్నీ సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్నారు, అయితే బ‌న్నీ తాజాగా ఓ కొత్త కండిషన్ ఓ డైరెక్ట‌ర్ కుపెట్టారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.మరి ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు కండిష‌న్ ఏమిటంటే,‌

బొమ్మ‌రిల్లు భాస్కర్ తెలుసుగా, ద‌ర్శ‌కుడిగా భాస్క‌ర్ కు ఆ సినిమాతో మంచి ఫేమ్ వ‌చ్చింది‌, అయితే త‌ర్వాత‌ బ‌న్నీతో కూడా ప‌రుగు సినిమా చేశారు ఆయ‌న.. మంచి హిట్ ఇచ్చింది, త‌ర్వాత బ‌న్నీతో ఎలాంటి చిత్రం చేయ‌లేదు.

తాజాగా ఇప్పుడు భాస్క‌ర్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ చిత్రం తీస్తున్నారు, ఇందులో అక్కినేని అఖిల్ కథానాయకుడిగాన‌టిస్తున్నారు. ఈ సినిమా తరువాత అల్లు శిరీష్ తో చిత్రం చేయడానికి భాస్కర్ సిద్ధమవుతున్నాడు. అయితే తాజాగా ఈ స‌మ‌యంలో బ‌న్నీకి కూడా ఓ క‌థ వినిపించార‌ట భాస్క‌ర్ , అయితే త‌మ్ముడి సినిమా హిట్ అవ్వాల‌ని అది హిట్ అయితే క‌చ్చితంగా ఓ సినిమా చేస్తాను అని అన్నాడ‌ట‌, ఈ టాక్ అయితే టాలీవుడ్ లో న‌డుస్తోంది.