ఆ కుటుంబాన్ని ఆదుకున్న సీఎం జ‌గ‌న్ అంద‌రూ శ‌భాష్ అంటున్నారు

ఆ కుటుంబాన్ని ఆదుకున్న సీఎం జ‌గ‌న్ అంద‌రూ శ‌భాష్ అంటున్నారు

0
40

నిజ‌మే వాలంటీర్లు అంటే చిన్న ఉద్యోగం అన్నారు, అయినా వారే నేడు ఈ వైర‌స్ పై పోరాటంలో ముందు ఉండి కేసులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు, అంద‌రూ వారికి సెల్యూట్ చేస్తున్నారు, నిత్యం వార్డుల్లో గ్రామాల్లో సేవ‌లు చేస్తున్నారు, అయితే తాజాగా ఈ స‌మ‌యంలో కొంద‌రు అనారోగ్యం పాల‌వుతున్నారు. వారికి ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ప్ర‌భుత్వం మీకు తోడుగా ఉన్నాము అని చెబుతోంది.

తాజాగా విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం వాలంటీర్ గబ్బాడ అనురాధ గుండెపోటుతో మరణించారు. కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఆమె ప్రాణాలు విడిచారు. ఆమె మ‌ర‌ణం అంద‌రిని క‌లిచివేసింది, ఈవార్త తెలిసిన వెంట‌నే సీఎం జ‌గన్ కూడా బాధ‌ప‌డ్డారు.

సీఎంవో అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనురాధ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా కష్టపడుతున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు సీఎం జ‌గ‌న్ .