ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా బడ్జెట్ మాములుగా లేదు – బాలీవుడ్ టాక్ | Director Nag Ashwin With Hero Phrabhas New Film

0
99

బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమా స్ధాయి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పెరిగింది, ఇక భారీ బడ్జెట్ సినిమాలు అంటే బాలీవుడ్ అని అనుకునే వారు అందరూ.. కానీ ఇప్పుడు తెలుగులో కూడా భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి… పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు మన తెలుగు దర్శక నిర్మాతలు. మన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇక మన తెలుగు దర్శకులతో పాటు బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు… ముఖ్యంగా నాలుగు స్టోరీలు లైన్ లో పెడితే మరో మూడు స్టోరీలు వింటున్నారు, అంత బిజీగా ఉన్నారు ప్రభాస్ …ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ అలాగే నాగ్ అశ్విన్ సినిమా ఒకే చేశారు ప్రభాస్.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాపై ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు, దీనిని హై ఎండ్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామాతో నిర్మిస్తున్నారు. అందుకే వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఓ హాలీవుడ్ టెక్నికల్ టీమ్ నే దించుతున్నారట. మరి ఈ సినిమాకి అనుకున్న దాని కంటే భారీగానే బడ్జెట్ అవుతోందట. ఈ సినిమాలో బీటౌన్ టాక్ ప్రకారం 8 మంది బాలీవుడ్ స్టార్లు కూడా నటిస్తున్నారట. ఈసినిమాకి సుమారు 400 కోట్ల వరకూ బడ్జెట్ ఉండవచ్చు అని టాక్ నడుస్తోంది.