ప్రేయసి కోసం వెళ్లి.. పాకిస్తాన్ లో చిక్కిన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విడుదల

0
33

ఆ యువకుడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు. పేరు ప్రశాంత్. ఉండేది హైదరాబాద్. మాదాపూర్ లోని ఒక ఐటి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. కానీ ఆ యువకుడు తన ప్రియురాలిని కలుసుకునేందుకు వెళ్లి చిక్కుల్లో పడ్డాడు. సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ లో చిక్కిపోయాడు. ఈ ఘటన 2017లో జరిగింది. ఆ యువకుడిని హైదరాబాద్ రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. ఆ యువ ఇంజనీర్  ను పాకిస్తాన్ సర్కారు విడుదల చేసింది.  ప్రశాంత్ విడుదల కావడంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. మరిన్ని వివరాలు చదవండి.

ప్రశాంత్ 2017లో స్విట్జర్లాండ్ లో ఉన్న తన ప్రియురాలు స్వప్నికా పాండేను కలుసుకునేందుకు వెళ్ళాడు. కానీ స్విట్జర్లాండ్ వెళ్లకుండా రాజస్థాన్ వెళ్లినట్లు… అక్కడి నుంచి థార్ ఎడారిలో తప్పిపోయి పాక్ సరిహద్దుల్లో ఆదేశ సైనికులకు చిక్కినట్లు తెలుస్తోంది. 2019 నవంబరు 14న పాక్ ప్రభుత్వం ప్రశాంత్ ను అనుమానితుడిగా గుర్తించి అరెస్టు చేసింది. అక్కడి ప్రభుత్వం అతడిని అన్ని రకాలుగా విచారించింది. జరిగిన ఘటనపై ప్రశాంత్ తండ్రి బాబూరావు 2019లో సైబరాబాద్ సిపి సజ్జనార్ ను కలిసి తన కుమారుడు పాక్ లో చిక్కిన విషయాన్ని వివరించారు. తుదకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంతో వాఘా సరిహద్దులో సోమవారం అక్కడి అధికారులు భారత్ కు ప్రశాంత్ ను సురక్షితంగా అప్పగించారు.

techie prasanth
techie prasanth

అప్పుట్లో ప్రేమ విఫలమై ప్రశాంత్ మానసికంగా కుండిపోయాడు

ప్రశాంత్ తండ్రి బాబురావు సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని కంచరాం గ్రామం. ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు శ్రీకాంత్, చిన్నవాడు ప్రశాంత్. బాబూరావు వైజాగ్ లో ప్రయివేటు ఉద్యోగిగా పనిచేసేవారు. విశాఖపట్నంలోని వా మిథలాపురికాలనీలోని గంగా రెసిడెన్సీ అపార్టుమెంట్ లో ఉండేవారు.

ఇద్దరు పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కావడంతో హైదరాబాద్ కు మారారు. కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. 2011లో ప్రశాంత్ బెంగుళూరులోని హువేయి టెక్నాలజీస్ అనే సంస్థలో కాంట్రాక్టు జాబ్ లో చేరాడు. ఆ కంపెనీ తరుపున చైనా, దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చాడు. అప్పట్లోనే స్వప్నికా పాండే అనే తోటి ఉద్యోగినితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విఫలం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని హైదరాబాద్ తీసుకొచ్చి మానసిక చికిత్స చేయించారు. కోలుకున్న ప్రశాంత్ 2016లో మాదాపూర్ లోని షోర్ ఇన్ఫోటెక్ లో ఉద్యోగంలో చేరాడు.

2017 లో ఏప్రిల్ 11న ఉద్యోగానికి వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో ప్రశాంత్ తండ్రి బాబూరావు ఏప్రిల్ 29న మాదాపూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.