దర్శకుడిని తెగ ఇబ్బంది పెడుతున్న హీరో టీమ్…

దర్శకుడిని తెగ ఇబ్బంది పెడుతున్న హీరో టీమ్...

0
97

ఆయన ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆయనతో సినిమా తీసేందుకు ఎలాంటి హీరోయినా డేట్స్ ఇస్తారు…. అయితే ఇప్పుడు అలాంటి డైరెక్టర్ ఒక హీరో చేతిలో ఇరుక్కుపోయారని అంటున్నారు… రెండేళ్లు దాటింది సినిమా ఇంకాపూర్తి కాలేదు… దీంతో దాదాపుగా కిల్ బిల్ పాండే రేంజ్ లో ఫ్రస్టేషన్ వస్తోందట… కానీ అక్కడ ఉండేది బడా స్టార్ కావడంతో కంటికి కనిపించని హీరోతో యుద్దం చేయలేక చస్తున్నారట…

ఇప్పటికే దర్శకుడు తయారు చేసిన కథను వీలైనంతగా కిచిడి చిసిబేలె బాత్ చేయడంలో హీరోగారి టీమ్ వంద శాతం సక్సెస్ అయ్యారట అది చాలదన్నట్టు గతంలో ఇదే దర్శకుడు రూపోందించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో ఉండే హీరోయిజం ఎలివేషన్ల స్థాయిలో ఈ సినిమాలో హీరోయిజం సీన్లు డిజైన్లు చెయ్యాలంటూ హీరోగారి టీమ్ ఒత్తిడి చేస్తున్నారట…

దర్శకుడేమో ఆ కథ వేరు ఈకథవేరు రెండూ ఒకటికాదు… ఒకటికి రెండుకాదు… మూడు అసలే కాదు ఈ మూడు ఆ మూడు అంటూ వారికి అర్థం అయ్యి కానీ తికమకజవాబులు చెప్పి తప్పించుకుంటున్నారట… అయితే హీరోగారి టీమ్ మహా తెలివైన వారు.. అందుకే ఇలాంటి ఎక్స్ ప్లనేషన్స్ ఏమాత్రం ఒప్పుకోకుండా మాకు అలాంటి సీన్స్ కావాలంటే కావాలని మారం చేస్తున్నారట…