ఆర్ ఆర్ ఆర్ ఐటం సాంగ్ కు ఆ హీరోయిన్ ఫిక్స్

ఆర్ ఆర్ ఆర్ ఐటం సాంగ్ కు ఆ హీరోయిన్ ఫిక్స్

0
77

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ ఆర్ ఈ చిత్రంలో స్టార్ హీరో రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు… ఈ చిత్రంలో చరణ్ మన్నెందొర అల్లూరి సీతారామరాజు పాత్రలో అలాగే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు…

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు… పాన్ ఇండియా మూవీ గా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కు చెందిన పలువులు నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు… అంతేకాదు ఈ చిత్రంలో ఐటం సాంగ్ ఉంటుందట.. ఈసాంగ్ కు ఎవరితో స్టెప్పులు వేయిస్తారన్నది పెద్ద ప్రశ్న…

తాజా సమాచారం ప్రకారం ఈ ఐటం సాంగ్ కోసం చిత్ర బృందం రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించిందట… ఈ ఐటం సాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించేందుకు ఒప్పుకుందట… నిజానికి తెలుగులో రకుల్ కు ఆఫర్స్ కరువయ్యాయి… మన్మథుడు 2 తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఇతర బాషల్లో అవకాశాలు వస్తున్నాయి తప్ప తెలుగులో మాత్రం రాకున్నాయి.. ఈ క్రమంలోనే ఆమె ఐటం సాంగ్ లో నటించేందుకు ఒప్పుకుందట..