Prabhas Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’ కథ ఇదే: దర్శకుడు సందీప్ రెడ్డి

-

Prabhas Spirit | దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమాలో నటించనున్నాడు. అంతేకాకుండా తొలిసారిగా ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. దీంతో అభిమానులు ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో సందీప్ పంచుకున్నాడు.

- Advertisement -

ఈ మూవీ కథ గురించి మాట్లాడుతూ “ఇందులోప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జీవితంలో తనకి బాగా దగ్గరైన వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది కథ. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ 60 శాతం పూర్తి అయింది. డిసెంబర్ నాటికీ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి.. షూటింగ్‌కి వెళ్తాం. ఈ మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్నాం. ట్రైలర్, టీజర్ ఆడియన్స్‌కి రీచ్ అయితే.. ప్రభాస్ ఇమేజ్‌కి తొలి రోజే రూ.150 కోట్లు వచ్చేస్తాయి” అని ధీమా వ్యక్తం చేశాడు.

అలాగే “యానిమ‌ల్ సినిమా కంటే ముందు ప్రభాస్ ఒక హాలీవుడ్ సినిమాని రీమేక్ చేద్దామని నన్ను సంప్రదించాడు. కానీ అనివార్య కారణాల వ‌ల్ల ఈ సినిమా ప‌ట్టాలెక్కలేదు. ఆ త‌ర్వాత ‘స్పిరిట్‌(Prabhas Spirit)’ క‌థ‌తో ప్రభాస్ ముందుకి వెళ్లాను. ఆ క‌థ ప్రభాస్‌కు బాగా న‌చ్చింది. ఈ సినిమా పూర్తి కాగానే ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ‘యానిమ‌ల్ పార్క్’ చేస్తా” అని వెల్లడించారు. దీంతో సందీప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: ‘పుష్ప’గాడి మాస్ జాతర మొదలైంది.. అమ్మవారిగా అదరగొట్టిన బన్నీ..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...