ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు లైన్ లో ఉన్నాయి- డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన

Director Trinadha Rao Nakkina New movie Updates

0
106

టాలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీలతో ప్రజలను ఆకట్టుకున్నారు డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మామ ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. తర్వాత నానితో నేను లోకల్ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. హీరో రామ్ తో హలో గురు ప్రేమ కోసమే సినిమా చేశారు.

ఇలా ఆయన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. నిర్మాతలకు హీరోలకి మంచి పేరు తెచ్చాయి. ఇలా ఆయన టాలీవుడ్ లో గుర్తింపు పొందారు. తాజాగా ఆయన రెండు సినిమాలు లైన్ లో పెట్టారు అని వార్తలు వినిపించాయి. త్రినాథ్ రావు రవితేజ తో ఓ సినిమా అలాగే సీనియర్ హీరో వెంకటేష్ తో ఓ సినిమాను ప్లాన్ చేసుకున్నారు. కొద్ది రోజులుగా ఈ రెండు చిత్రాలు ఆగిపోయాయి అని వార్తలు వినిపించాయి.

తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు, హీరో రవితేజ సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఆయన కమిట్ అయిన చిత్రాలు పూర్తి అయ్యాక ఆయన ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లొచ్చు అన్నారు. వెంకటేశ్ తో ప్రాజెక్టు కూడా ఆగలేదు. ఆ కథ క్లైమాక్స్ గురించి చర్చలు నడుస్తున్నాయి. అది కూడా అవుతుంది అని తెలిపారు త్రినాథ్ రావు.