Thalapathy Vijay | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నెక్ట్స్‌ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా

-

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌(Thalapathy Vijay) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ప్రస్తుతం ఈ హీరో లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. దళపతి 67గా వస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా, ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే మరోవైపు దళపతి 68 వార్త కూడా నెట్టింట హల్‌ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు(Director Venkat Prabhu) డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 2023లో షురూ కానుంది.

- Advertisement -

2024 తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త ఇప్పటికే కోలీవుడ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్‌ను మార్చినట్టు నటుడు అరుణ్ విజయ్‌ ట్వీట్ చేశాడు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం అక్టోబర్ 2023లో దళపతి 68 చిత్రీకరణ మొదలు కానుండగా.. 2024 దీపావళి కానుకగా రాబోతుందని తెలియజేశాడు. వెంకట్‌ ప్రభు-విజయ్‌ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పక్కా పొలిటికల్ జోనర్‌లో ఉండబోతుందని కూడా ప్రకటించేశాడు. ఇప్పుడీ అప్‌డేట్ విజయ్‌(Thalapathy Vijay) అభిమానులను ఖుషీ చేస్తోంది.

Read Also:
1. పెళ్లి కాని వారికి పెన్షన్.. సీఎం కీలక నిర్ణయం

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...