డిస్కోరాజా నిర్మాతలకు షాకిచ్చిన రవితేజ

డిస్కోరాజా నిర్మాతలకు షాకిచ్చిన రవితేజ

0
96

మాస్ మహారాజ్ సినిమా అంటే అభిమానుల్లో సరికొత్త జోష్ ఉంటుంది. తాజాగా రవితేజ ల్యాంగ్ గ్యాప్ తో విడుదల చేస్తున్న చిత్రం డిస్కోరాజా..
దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ కథ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుంది. దీనిపై అభిమానుల్లో ఎంతో ఆత్రుత కనిపిస్తోంది, సినిమా ఎలా ఉంటుంది అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

అయితే సైంట్ ఫిక్ కి సంబంధించిన కొన్ని అంశాల్లో స్పష్టత లోపించడం పట్ల రవితేజ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. అందుకే ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకం అనుకున్న సీన్లు రీషూట్ చేయాలి అని భావించారట, దీనికి చిత్ర యూనిట్ నిర్మాతలు కూడా ఒకే చెప్పారు అని తెలుస్తోంది..ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజన్ కి గురి కాకూడదనే ఉద్దేశంతో ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించాడట.

మొత్తానికి సినిమాకి ప్రివ్యూ ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడంతో సినిమాకు మంచి క్రెడిట్ అవుతుంది అని చిత్ర యూనిట్ భావిస్తోంది.. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా వరకూ పూర్తి చేసుకుంది అని తెలుస్తోంది. అయితే తాజాగా కొన్ని సీన్లు మళ్లీ రీ షూట్ చేస్తున్నారట .. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే ఆయన ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇక మాస్ మహరాజ్ అభిమానులకు జనవరి 24వ తేదీన ఈ చిత్రం విడుదల అవనుంది కాబట్టి ఆరోజు పండుగే అని చెప్పాలి