‘పుష్ప’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా?

Do you know much about 'floral' first day collections?

0
108
Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా పుష్ప. ఈ మూవీ నిన్న పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల‌తో పాన్ ఇండియా లెవ‌ల్ లో 3000 కు పైగా థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయింది.

అయితే ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ లు ఎంత వ‌చ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంతలా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. శుక్ర వారం ఒక్క రోజే వ‌ర‌ల్డ్ వైడ్ గా పుష్ప సినిమా కు 47.50 కోట్ల వ‌సూల్ చేసింద‌ని తెలుస్తుంది. అల్లు అర్జున్ కేరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ క‌లెక్ష‌న్లు అని చెప్ప‌వచ్చు.

అయితే పుష్ప సినిమా కొన్ని ప్రాంతాల‌లో శ‌నివారం విడుద‌ల కావ‌డం, క‌న్న‌డ లో బాయ్ కాట్ ఉద్య‌మం వంటి స‌మ‌స్యలు ఎదురు అయినా.. దాదాపు రూ. 50 కోట్ల మార్క్ ను అందుకుందంటే గొప్ప విష‌యం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు బ‌డ్జెట్ దాదాపు రూ. 200 కోట్ల వ‌ర‌కు కేటాయించారు. అయితే ఇలాగే క‌లెక్ష‌న్స్ న‌డిస్తే మ‌రో నాలుగు నుంచి ఐదు రోజుల్లో బ‌డ్జెట్ వ‌చ్చేస్తుంది.