అందాల తార పూజ హెగ్డే డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా ?

Do you know the cost of beauty star Pooja Hegde dress?

0
86

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఏ దర్శక నిర్మాత అయినా హీరో అయినా స్టోరీ వినగానే హీరోయిన్ గా ఆమెన తీసుకోమంటున్నారు. ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావడంతో ఆమెకి అవకాశాలు అలాగే వస్తున్నాయి. హిందీలో హృతిక్ రోషన్ సరసన కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో అల వైకుంఠపురం చిత్రంతో భారీ హిట్ అందుకుంది.

అయితే సెలబ్రెటీలు కచ్చితంగా అతి ఖరీదైన దుస్తులు వాడతారు అనేది తెలిసిందే. అయితే ఆమె కూడా అతి ఖరీదైన దుస్తులు వాడతారట. ఎక్కువగా ప్రముఖ బ్రాండ్ అనీతా డోంగ్రే డ్రెస్ లు ధరిస్తుంది. ఈ బ్రాండ్ దుస్తుల ధర ఎక్కువగా ఉంటుంది అని టాక్ . ఒక్కో డ్రస్ ఖరీదు దాదాపు 1.50 నుంచి 2 లక్షల వరకూ ఉంటుంది అంటున్నారు.

ఇక ఫుట్వేర్ విషయానికొస్తే టిన్సెల్ టోస్ అనే బ్రాండ్ను పూజ బాగా ఇష్టపడుతుందట. ఇది సుమారు 2500 నుంచి ఉంటుంది అంటున్నారు. అనీతా డోంగ్రే అనే డిజైనర్ కి ఎంతో పేరు ఉంది. 2015లో తన పేరుమీదే ముంబైలో ఒక ఫ్యాషన్ హౌస్ మొదలు పెట్టింది ఇక్కడ చాలా మంది సెలబ్రెటీలు ఈ దుస్తులు తీసుకుంటారు.