పుష్ప సినిమాలో బన్నీ చెల్లెలుగా ఆ హీరోయిన్ ?

Who is the heroine of the movie 'Pushpa' as allu arjun younger sister?

0
116

అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సినిమా షూటింగ్ కాకినాడ పోర్టు దగ్గర జరుగుతోంది. అయితే ఈ సినిమాలో బన్నీకి ఓ సిస్టర్ ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ముందు ఓ యాంకర్ ని పరిశీలించారట. అయితే తాజాగా మరో పేరు తెరపైకి వస్తోంది.
కథలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఒక భాగమనే ముందు ఐశ్వర్య రాజేశ్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

తాజాగా వర్ష బొల్లమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఇక ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చినా తాజాగా వర్ష బొల్లమ్మ పేరు బాగా వినిపిస్తోంది.
తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రంతో మంచి ఫేమ్ వచ్చింది. పుష్ప సినిమా కోసం ఈ అమ్మాయిని తీసుకున్నారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయనున్నారట. ఈచిత్రంలో రష్మిక నటిస్తుంది ఇక ప్రతినాయకుడి పాత్రలో
ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నారు. సుకుమార్ ఈ సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కీలక షూటింగ్ షెడ్యూల్
ఇప్పటికే పూర్తి అయిందట.