హీరో వెంకటేష్ ఆస్తుల విలువ ఎంత ఉంటుందో తెలుసా?

Do you know the value of Hero Venkatesh's assets

0
133

సినిమా పరిశ్రమలో స్టార్ స్టేటస్ ఎప్పుడూ పర్మినెంట్ కాదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే వారికి ఎంతో పేరు వస్తుంది. మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయి. అదే సినిమా ఫ్లాప్ అయితే డిజాస్టర్ అయితే అప్పటి వరకూ ఉన్న దర్శకులు నిర్మాతలు ఎవరూ పెద్ద పట్టించుకోరు. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ సినిమా నటులు బాగా ఫాలో అవుతారు.

అయితే హీరో వెంకటేష్ కి టాలీవుడ్ లో ఎంత ఫేమ్ ఉందో తెలిసిందే. కుటుంబ కథా చిత్రాలు, లవ్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్, మాస్, యాక్షన్,ఇలా అన్నీ జోనర్ చిత్రాలు చేసి విక్టరీ వెకంటేష్ గా పేరు సంపాదించుకున్నారు.
అయితే ఆయన ఆస్తులు సుమారు ఎంత ఉంటాయో తెలుసా ?టాలీవుడ్ వార్తల ప్రకారం సుమారు 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయట.

అయితే ఆయన సినిమాలు చేస్తూ సగం ఆదాయం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. అందుకే అది బంగారు బాతు అయింది అంటారు. తన అన్న నిర్మాత సురేష్ బాబు కూడా ఇలాగే చేసేవారు. ఇదే ఫార్ములా ఆయన ఫాలో అయ్యారు. అయితే వెంకీకీ మరో మంచి పేరు ఉంది. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలని అస్సలు ఇబ్బంది పెట్టేవారు కాదట. ఎందుకంటే నిర్మాతల కష్టాలు ఆయనకు తెలుసు, ఆయన తండ్రి నిర్మాత రామానాయుడు సినిమా పరిశ్రమలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో తెలిసిందే.