శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Do you know these things about Shiva Shankar Master?

0
47

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్‌ శివ శంకర్‌, అజయ్‌ శివ శంకర్‌ ఇద్దరూ డ్యాన్స్‌ మాస్టర్లే. తన శిష్యులను కూడా సొంత కొడుకులా చూసుకునే వారు శివ శంకర్ మాస్టర్.

ఆయనతో కలిసి పని చేయడానికి ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపించారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో ఆయన కంపోజ్ చేసిన ధీర ధీర పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. దాంతో పాటు తమిళనాడు స్టేట్ మరో నాలుగు అవార్డులు ఇచ్చి ఆయనను సత్కరించింది. 74 సంవత్సరాల శివ శంకర్ మాస్టర్ దాదాపు 800 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఎక్కువగా సౌత్ సినిమాలకు వర్క్ చేశారు శివశంకర్ మాస్టర్ 1975లో ‘పాట్టు భరతమమ్‌’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు.

కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా తనదైన ముద్ర వేశారు. 2003లో వచ్చిన‌ ‘ఆలయ్‌’చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్‌ మాస్టర్‌ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. ఈయన వెండితెరపై కన్పిస్తే చాలు ప్రేక్షకుల మొహాలపై నవ్వులు వచ్చేవి. విభిన్నమైన తన బాడీ లాంగ్వేజ్ తో అందరినీ ఆకట్టుకున్నారు శివ శంకర్ మాస్టర్. చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. ఓంకార్ హోస్ట్ గా వచ్చిన ఛాలెంజ్ డ్యాన్స్ షోకు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహించారు.