కత్తి మహేష్ గురించి పవన్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో తెలుసా

Do you know what Pawan fans are doing about Katti Mahesh

0
40

సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిన్న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్ధితి విషమంగా ఉంది. టాలీవుడ్ చిత్ర ప్రముఖులు కూడా మహేష్ ఆరోగ్యం ఎలా ఉందా అని, కుటుంబ సభ్యులు సన్నిహితుల ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి, కత్తి మహేష్ కి అస్సలు పడదు అనేది తెలిసిందే. ఇక కత్తి మహేష్ ఇలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ గురించి సోషల్ మీడియా వేదికగా ఆయన బాగోవాలి అని కోరుకుంటున్నారు.

సాటి మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే ఆయన కోలుకోవాలని కోరుకోవడం సహజమే. అది శత్రువు అయినా ఆపద సమయంలో అన్నీ మరచి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా అదే చేస్తున్నారు. విమర్శలు ఆరోపణలు ఎన్ని చేసినా అవన్నీ పక్కన పెడదాం. కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలి అని ఆ దేవుడ్ని ప్రార్ధిద్దాం అని, సోషల్ మీడియా వేదికగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

కత్తి మహేష్ గారు కోలుకోవాలని ఆ శ్రీరాముణ్ణి వేడుకుంటున్నాం. ప్రాణం ఎవరికైనా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారు మాకు ద్వేషించడం నేర్పలేదు. శత్రువుని అయినా క్షమించు అని నేర్పించారని ట్వీట్స్ పెడుతున్నారు.