చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలనటులుగా నటించి తర్వాత హీరోలుగా హీరోయిన్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు, అలాంటి వారిలో నటి రాశి ఒకరు…ఆరేళ్ల వయసు నుంచే ఆమె సినిమాల్లో నటించారు.. తర్వాత 16 ఏళ్లకు ఆమె హీరోయిన్ అయ్యారు, తెలుగు తమిళ మలయాళం కన్నడ చిత్రాల్లో ఆమె నటించారు.
ఇక తెలుగులో పవన్ కల్యాణ్ తో గోకులంలో సీత సినిమా మంచి పేరు తీసుకువచ్చింది… తర్వాత పెళ్లి పందిరి మనసిచ్చిచూడు సినిమాతో ఇక వెనక్కి తిరిగిచూసుకోలేదు. ఇక ఆమెని చాలా మంది వివాహం చేసుకోవాలని ప్రపోజ్ చేశారు.. చాలా మంది వ్యాపారవేత్తలు నటులు హీరోలు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని అడిగారు …కాని ఆమె వారికి నో చెప్పారు.
రాశీ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె చేసిన అనేక సినిమాలకు ఆయన అసిస్టెంట్ దర్శకుడిగా చేశారు. ఆయనే శ్రీముని, ఇలా అతని కేరింగ్ నచ్చి ఆమె అతన్ని ప్రేమించారు, ఆమె స్వయంగా పెళ్లి చేసుకోమని కోరింది.. దీంతో ఆయన కూడా ఒకే చెప్పారు,ఇలా ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు.