‘అన్ స్టాపబుల్’ థర్డ్ గెస్ట్ ఎవరో తెలుసా?

Do you know who the 'unstoppable' third guest is?

0
49

ఆహా’ కోసం బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె’ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ కు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రసారమైంది. అయితే మొదటి ఎపిసోడ్ కు మోహన్ బాబు మంచు విష్ణు మంచు, లక్ష్మి మంచు లు గెస్ట్ గా వచ్చారు.

ఆ తరువాత ఎపిసోడ్ ను నానితో చేశారు. స్టేజ్ పైనే చిన్న చిన్న గేమ్స్ ప్లాన్ చేసినా, ఈ ఎపిసోడ్ అంతగా పేలలేదు. బాలయ్య వైపు నుంచి కొంత ఎమోషన్ ను కనెక్ట్ చేయటం వలన, కొంతలో కొంతవరకూ ఆ ఎపిసోడ్ కి హెల్ప్ అయింది. ఇక త్వరలో ఈ షోలో రోజా కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇటీవల రోజా బర్త్ డే కి గ్రీటింగ్స్ చెప్పిన బాలయ్య ..ఈ షో గురించి ప్రస్తావించగా, తాను వస్తానని రోజా చెప్పారట. త్వరలోనే ఆమెతో టాక్ షో ఉండొచ్చని అంటున్నారు. రాజకీయల సంగతి అటుంచితే, ఇద్దరి కాంబినేషన్లో ‘భైరవద్వీపం’.. ‘బొబ్బిలి సింహం’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలాగే ఉంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ రభసను పక్కన పెట్టేసి రోజా ఎప్పుడు వస్తుందో చూడాలి.