ఉప్పెన సినిమాలో ముందు హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారో తెలుసా ?

ఈ సినిమాలో మొదట కృతిని హీరోయిన్గా అనుకోలేదట డైరెక్టర్ బుచ్చిబాబు సాన

0
142

ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. కృతి, వైష్ణవ్ కు అవకాశాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా డైరెక్టర్ చెప్పిన ఓ వార్త వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో మొదట కృతిని హీరోయిన్గా అనుకోలేదట డైరెక్టర్ బుచ్చిబాబు సాన. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. షూటింగ్ కి కొన్ని రోజుల ముందు మనీషా అనే తెలుగమ్మాయిని హీరోయిన్ గా అనుకున్నారట. సినిమా ప్రారంభానికి ముందు సోషల్ మీడియాలో కృతిశెట్టి ఫొటోలు చూసిన దర్శకుడు బుచ్చి బాబు ఈ విషయం సుకుమార్ కు చెప్పి ఆయన సలహా తీసుకున్నారట

సుకుమార్ నీ సినిమా నీ మనసు ఏది చెబితే అది విను అని సమాధానం చెప్పారట. ఇలా ఈ కన్నడ బ్యూటీ హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఇప్పుడు వరుసగా అనేక సినిమాలు నటిస్తోంది.