కోవై సరళ ఎందుకు వివాహం చేసుకోలేదో తెలుసా ?

Do you know why Kovai Sarala did not get married?

0
235

చిత్ర సీమలో ఎందరో కమెడియన్స్ వచ్చారు వెళ్లారు. కానీ కొందరు మాత్రం తమ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా లేడి కమెడియన్ లో కోవై సరళ ఒకరు. తెలుగు తమిళ్ లో ఆమె అందరు హీరోలతో సినిమాలు చేశారు. ఆమె సినిమాలో ఉన్నారంటే అద్భుతమైన కామెడీ వస్తుంది. నిత్యం షూటింగులతో బిజీగా ఉంటారు కోవై సరళ.

ఇక తెలుగులో సినిమాలకు ఆమె నేరుగా తన వాయిస్ డబ్బింగ్ చెప్పుకుంటారు. నువ్వే కావాలి, దేశముదురు, కాంచన ఇలాంటి సినిమాల్లో ఆమె కామెడికి మంచి పేరు వచ్చింది. కోవై సరళ బ్రహ్మానందం కామెడీ అంటే చాలా మందికి ఇష్టం. ఇక సుమారు ఆమె 800 చిత్రాల్లో నటించారు.

కోవై సరళ వయసు ప్రస్తుతం 59 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు అయినా ఆమె పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు అనేది చాలామందికి తెలియదు. ఆమె కుటుంబ ఆర్ధిక పరిస్దితి బాగాలేకపోవడంతో, తన చెల్లెల్లు నలుగురికి వివాహం చేసి వారి పిల్లలని ప్రయోజకులని చేశారు. ఇక ఆ బాధ్యతలతో ఉండి ఆమె పెళ్లి గురించి అస్సలు పట్టించుకోలేదట. నిజంగా ఆమెది ఎంతో మంచి మనసు అంటారు అభిమానులు.