ఈ విషయంలో పక్కా ప్లాన్ తో ఉన్న మహేష్ బాబు

ఈ విషయంలో పక్కా ప్లాన్ తో ఉన్న మహేష్ బాబు

0
104

మహేష్ బాబుతో వంశీ సినిమా ఇక లేనట్టే అని వార్తలు వస్తున్నాయి… ఈ సమయంలో మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ తో సినిమా చేయబోతున్నారట, అయితే ఇంకా వంశీ ఎగ్జిట్ అని క్లారిటీ అయితే రాలేదు, ఇక మహేష్ బాబు 27వ సినిమా పరశురామ్ చేస్తే కచ్చితంగా మైత్రీ మేకర్స్ దీనిని నిర్మిస్తుంది, ఇక సంయుక్తంగా మహేష్ బాబు సంస్ద నిర్మాణంలో పార్ట నర్ గా ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.

కాని పరశురామ్ చిత్రం పై ప్రకటన వచ్చే వరకూ ఇది క్లారిటీగా చెప్పలేము..ఇప్పటికే చైతన్యతో పరశురామ్ ఓ సినిమా చేస్తున్నాడు. అది రిలీజవ్వాలంటనే ఇంకో ఆరేడు నెలలు పడుతుంది. మరి ముందు మహేష్ బాబుతో సినిమా ఒకే చేసుకుంటే మహేష్ బాబు దాదాపు మరో ఆరునెలలు ఖాళీగా ఉండాలి.. అంటే దసరా వరకూ ప్రిన్స్ ఖాళీ ఉండాలి సో ఇది కుదిరే పనికాదు.

అయితే పరశురామ్ కి కూడా మహేష్ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు.. ఇటు వంశీ చిత్రం ఒకే అయితే సినిమా చేస్తారు, లేకపోతే మరో దర్శకుడితో సినిమాకి రెడీ అవుతారు అని తెలుస్తోంది, తాజాగా పలు కథలు వినేందుకు కూడా రెడీ అవుతున్నారట మహేష్.. ఈలోగా చిరు కొరటాల చిత్రంలో కూడా ఆయన నటించే అవకాశం ఉంది … సో ఈరెండు నెలల్లో ఆ షూటింగ్ పూర్తి చేసి కొత్త కథని ఫైనల్ చేసి సెట్స్ పై కి వెళతారట.