ఎఫ్‌3′ అదిరిపోయే అప్డేట్‌..కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

F3 'creepy update..new release date fix

0
125

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్​గా వస్తున్న ఈ సినిమాను డబ్బు నేపథ్య కథతో హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఎఫ్ 3 మూవీని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అలాగే  తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు. వాలైంటెన్స్‌ డే నేపథ్యంలో.. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. మే 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

“పిల్లలు పరీక్షలు ముగించుకోండి, పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం” అంటూ ఎఫ్‌ 3 చిత్ర బృందం ప్రకటన చేసింది. ‘ఎఫ్ 3’ సినిమా కొత్త రిలీజ్​ తేదీ ఖరారు చేశారు. ఏప్రిల్ 28న కాకుండా మే 27న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పోస్టర్​ కూడా విడుదల చేశారు.