సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న F3..న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

F3 .. New Release Date Fix

0
111

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్‌గా, సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీని 2022, ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించిన ‘ఎఫ్ 2’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది.