మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ లలిత్ మోదీ డేటింగ్ లో ఉన్నారు. ఈ విషయాన్ని సుస్మిత కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తాము పెళ్లి, ఎంగేజ్మెంట్ చేసుకోలేదని, అయితే తాము ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అందగత్తె ఇంతకుముందు ఏకంగా 10 మందితో సహజీవనం చేసింది.
అయితే ఇందులో కొందరు సినిమా వ్యక్తులు కాగా మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు. మోడల్ రోహ్మాన్ షాల్, ‘దస్తక్’ సినిమా నటుడు విక్రమ్, రణ్‌దీప్, దర్శకుడు ముద్దాసిర్ అజీజ్, వసీం అక్రమ్, యాడ్స్ డైరెక్టర్ మానవ్ మీనన్, రితిక్ భాసిన్, హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా, వ్యాపారవేత్త ఇంతియాజ్ ఖత్రీ, హోటల్ వ్యాపారి సంజయ్ నారంగ్ తో సహజీవనం చేసింది.
వీరందరితోనూ డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్నిరోజులకే వారి బంధానికి ముగింపు పలికింది. అయితే అందుకు వివిధ కారణాలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు, మనస్పర్థలు ఇతరత్రా కారణాల చేత వారు బంధానికి ముగింపు పలికారు.