ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..వారికి భారీ సాయం

0
33
CM Jagan

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనితో వాగులు, వంకలు, నదులు నిండు కుండను తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి నది ఉప్పొంగడంతో అనేక మంది వరదలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఈ సందర్బంగా అధికారులను ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలని ఆదేశించారు.

48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలన్నారు. ప్రజలతో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయడం, భద్రతా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.