Salaar బొమ్మ దద్దరిల్లిపోయింది.. ఫ్యాన్స్ రచ్చ మామాలుగా లేదుగా..

-

దేశమంతా ఇప్పుడు ప్రభాస్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా సలార్(Salaar) రచ్చే కనపడుతోంది. సలార్.. సలార్.. ఇదే మాట ఏ థియేటర్లో చూసినా.. బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టాడు ప్రభాస్. ప్రభాస్ నుంచి సరైన మాస్ బొమ్మ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘సలార్’ ఫుల్ స్టాప్ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కు ఈ మూవీ ఫుల్ మీల్స్‌ అందించింది. ఏ థియేటర్ దగ్గరి చూసినా ఫ్యాన్స్ హంగామా మామాలుగా లేదు. తమ హీరోకు సరైన హిట్ పడిందంటూ టపాసులు కాల్చి.. పాలాభిషేకాలు చేసి, డ్యాన్స్‌లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్, దేవ పాత్రలో ప్రభాస్‌(Prabhas).. వ‌ర‌ద రాజమ‌న్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్‌(Prithviraj Sukumaran) అదరగొట్టారు. 1995 నేపథ్యంలో సాగే చిన్నారుల స్నేహం నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది.. ఇంటర్వెల్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఫైట్స్ ముందు ప్రభాస్‌కి ఇచ్చిన హీరోయిజం ఎలివేషన్స్ అయితే పీక్స్ అని చెప్పవచ్చు. మొత్తానికి ప్రభాస్ ఖాతాలో మరో రూ.1000 కోట్ల సినిమా పడిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తున్నారు.

మరోవైపు పలువురు ప్రముఖులు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. హీరోలు నిఖిల్, శ్రీవిష్ణు సలార్(Salaar) సినిమాని వీక్షించారు. సలార్ మాన్‌స్టర్ హిట్ అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు. ఇక శ్రీవిష్ణు అభిమానులతో కలిసి ఓ థియేటర్‌లో విజిల్స్ వేస్తూ రచ్చరచ్చ చేశారు. మొత్తానికి చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి సరైన హిట్ సినిమా రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Read Also: సీఎం జగన్‌కి వ్యంగ్యంగా నాగబాబు బర్త్‌డే విషెస్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...