అభిమానులకి షాక్ ఇచ్చిన పూజ హేగ్దే -ఇదేం కామెంట్

అభిమానులకి షాక్ ఇచ్చిన పూజ హేగ్దే -ఇదేం కామెంట్

0
123

కొందరు సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో కొన్ని విషయాలలో ఆచితూచి మాట్లాడరు.. దాని వల్ల ఆ కామెంట్లు వివాదాస్పదం అవుతాయి, ఇప్పుడు బుట్టబొమ్మ టాలీవుడ్ లో ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న పుజాహెగ్డే ఇరుకున పడింది.

పూజ హేగ్దే. కెరీర్ బిగినింగ్ లో వరుస అపజయాలతో ఉంది, కాని తర్వాత తెలుగులో ఆమెకి వరుస హిట్లువచ్చాయి, ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతోంది, ముఖ్యంగా సౌత్ ఇండియా ఆమెని అక్కున చేర్చుకుంది, బాలీవుడ్ లో సినిమాలు చేసినా పెద్దగా అక్కడ ఆమెకి ఫేమ్ రాలేదు.

బాలీవుడ్ లో ఏకంగా హ్రితిక్ రోషన్ తో సినిమా చేసినా ఆమెను అక్కడి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పట్టించుకోలేదు.
తాజాగా జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ దక్షిణాది వాళ్లకు హీరోయిన్ల నడుమంటే వ్యామోహమని, మమ్మల్ని కురచ దుస్తుల్లో చూడటానికే వాళ్ళు ఇష్టపడతారని చెప్పింది, ఇది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణం అయింది, ఆమెపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు, మరి ఇంకెందుకు వెళ్లి బాలీవుడ్ లో సినిమాలు చేసుకోవచ్చుకదా అని తెలియచేస్తున్నారు. అయితే దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో పూజని ప్రశ్నిస్తున్నారు