స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం లో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. మహేష్ బాబు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కళావతి సాంగ్, టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసి అభిమానులను ఈలలు వేసేలా చేసింది. నిన్న సర్కార్ వారి పాట ట్రైలర్ రిలీజ్ చేసి మహేష్ అభిమానులకు ఆనందపరిచింది.
కానీ హైదరాబాద్ కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్కారి వారి పాట ట్రైలర్ విడుదల చేసే సమయంలో మహేశ్ బాబు అభిమానులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం కావడంతో పాటు కొంతమంది అభిమానులకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. కానీ ఇలా ఎందుకు చేశారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.