టాలీవుడ్ లో విషాదం ప్రముఖ నిర్మాత మృతి

Film Producer Bommireddy Raghava Prasad Passed away

0
113

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందారు. ఈ వార్త ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరిని షాక్ కి గురిచేసింది. పి.గన్నవరం మండలం రాజులపాలెం మాజీ సర్పంచ్, సినీ నిర్మాత, హీరో బొమ్మిరెడ్డి రాఘవప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు.

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక అనేక సినిమాల్లో సహాయ నటుడిగా కూడా నటించి మంచి పేరు సంపాదించారు. కిరాతుకుడు సినిమాలో హీరోగా నటించి, తానే ఆ సినిమాను నిర్మించి విడుదల చేశారు. అంతేకాకుండా రూపాయి అనే సినిమాకి సహ నిర్మాతగా చేశారు.

రాజధాని, బంగారు బుల్లోడు, దొంగల బండి, సౌర్య చక్ర, రంగవల్లి ఇలాంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. టాలీవుడ్ లో పలు చిన్న సినిమాలకు నిర్మాతగా కూడా చేశారు. ఆయన మరణ వార్త విని సినిమా రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.