బడా మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం..!!

బడా మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం..!!

0
49

వరుణ్ ధావన్-సారా అలీఖాన్ జంటగా డేవిడ్ ధావన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం కూలి నెంబర్ 1 .. తొలి షెడ్యూల్ థాయ్ లాండ్ లో చిత్రీకరించగా ముంబయిలో షూటింగ్ షెరవేగంగా జరుపుకుంటుంది.. అయితే ఈ సినిమా సెట్ లో ఈనెల 11 న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చిత్రబృందం తెలిపింది.ప్రాణ నష్టం జరగలేదు. కానీ, ఆస్థినష్టం భారీగా జరిగినట్టు తాజా సమాచారమ్.. దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని బాలీవుడ్ లో టాక్. అగ్నిప్రమాదం జరిగిన కారణంగా కొన్ని రోజుల పాటు ఈ షూటింగ్ ను వాయిదా వేశారు.