ఆకట్టుకుంటున్న మీకు మాత్రమే చేప్తా సాంగ్..!!

ఆకట్టుకుంటున్న మీకుమాత్రమేచేప్తా సాంగ్..!!

0
43

పెళ్లిచూపులు తో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. రెండవ సినిమా అంతగా ఆకట్టుకుపోయినప్పటికీ విమర్శకుల ప్రశంశలు మాత్రం అందుకుంది.. అయితే డైరెక్షన్ పక్కనపెట్టి తరుణ్ ప్రస్తుతం హీరో గా ఓ సినిమా చేస్తున్నాడు.. విజయ్ దేవరకొండ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా పేరు “మీకు మాత్రమే చెప్తా”..

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఏ ఎందుకు వై ఇలా .. నాకు మాత్రం ఎందుకిలా .. తప్పు మీద తప్పు తప్పై నాకే ఎందుకిలా?” అంటూ సాగే ఈ సాంగ్ యూత్ ని ఆకట్టుకునే లా ఉంది.. శివకుమార్ సంగీతం .. రాకేందుమౌళి సాహిత్యం .. హేమచంద్ర – కృష్ణన్ గణేశన్ ఆలాపనతో ఈ పాట సాగింది. హీరో గా స్టార్ హోదాకి వెళ్లిన విజయ్ నిర్మాతగా ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి మరి.