కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట సమీపంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) షూటింగ్ సెట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. హమారా దాబా ఎదురుగా గతంలో పవన్ కల్యాణ్ మూవీ కోసం సెట్ వేశారు. దానిని తాజాగా తొలగించేందుకు వెల్డింగ్ చేస్తున్న సమయంలో ధర్మా కోల్ అంటుకొని అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.