Kannappa | ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్‌ విడుదల.. విల్లు ఎక్కుపెట్టిన మంచు విష్ణు..

-

మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మ‌హాశివ‌రాత్రి పండుగ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో విష్ణు ఓ భారీ జ‌ల‌పాతం కింద విల్లును ఎక్కుపెట్టాడు. పోస్టర్ చూస్తుంటే ఈ మూవీని గ్రాండ్‌గా నిర్మిస్తున్నట్లు అనిపిస్తోంది. శివుడికి వీరభక్తుడైన కన్నప్ప జీవితచరిత్ర అధారంగా ఈ సినిమాను రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ‘మహాభారతం’ సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా ఫైట్స్ అందిస్తున్నాడు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథ అందించగా.. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, నయనతార, కిచ్చా సుదీప్, మోహన్ బాబు లాంటి స్టార్లు నటిస్తు్న్నారు. దీంతో ఈ సినిమా(Kannappa)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: రాజ్యసభకు ఇన్ఫోసిస్ సుధామూర్తి.. ప్రధాని మోదీ ప్రకటన..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

IFS Officers | తెలంగాణలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ సర్కార్ 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను(IFS Officers) బదిలీ చేసింది....

IAS Officers | తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల(IAS Officers) విషయంలో మరో కీలక నిర్ణయం...